Nara Lokesh: ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

Nara Lokesh: సచివాలయంలోని 4వ ఛాంబర్‌లో లోకేష్‌ బాధ్యతల స్వీకరణ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Jun 2024 2:52 PM IST
Nara Lokesh took charge As IT And Education Minister
X

Nara Lokesh: ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

Nara Lokesh: ఏపీలో ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. 16 వేల 347 పోస్టుల భర్తీకి అవసరమైన విధివిధానాలకు కేబినెట్ ముందుకు తీసుకెళ్లే ఫైల్‌పై సంతకం పెట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అభినందనలు తెలిపారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న లోకేష్‌కు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్‌లో లోకేష్ ప్రత్యేక పూజలు చేయగా.. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story