Nara Lokesh: నేడు చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న లోకేష్‌

Nara Lokesh: 20 రోజుల తర్వాత రాజమండ్రికి లోకేష్‌

Jyothi
Published on: 6 Oct 2023 9:37 AM IST
Nara Lokesh to Rajahmundry Today
X

Nara Lokesh: నేడు చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న లోకేష్‌

Nara Lokesh: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో.. లోకేష్ ములాఖత్ కానున్నారు. గత నెల 9న ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించడంతో పాటు జాతీయ రాజకీయ పార్టీలను కలిసేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుండి లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ రాజమండ్రికి లోకేష్ రానున్నారు.

చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. దీంతో 10 రోజులుగా చంద్రబాబుకు బెయిల్ ఇస్తారా, కస్టడీకి ఇస్తారా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒకానొక దశలో ఇరువురు న్యాయవాదులు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో న్యాయమూర్తి వారి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, విచారణ వాయిదా వేశారు. ఇక చంద్రబాబు రిమాండ్‌ను కూడా ఈనెల 19వ తేదీ వరకు పొడిగించారు.

Jyothi

Jyothi

Next Story