Nara Lokesh: నిన్న సుబ్బారావు గుప్తా, నేడు వెంకటనారాయణ.. రోజుకొక‌రు వైసీపీ పిశాచ‌ ముఠాలకి బ‌ల‌వ్వాల్సిందేనా?

Nara Lokesh: వెంకటనారాయణపై వైసీపీ రాక్షస‌మూక‌ల చ‌ర్యల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.

Arun Chilukuri
Published on: 21 Dec 2021 4:05 PM IST
Nara Lokesh Slams YCP Leaders
X

Nara Lokesh: నిన్న సుబ్బారావు గుప్తా, నేడు వెంకటనారాయణ.. రోజుకొక‌రు వైసీపీ పిశాచ‌ ముఠాలకి బ‌ల‌వ్వాల్సిందేనా? 

Nara Lokesh: వెంకటనారాయణపై వైసీపీ రాక్షస‌మూక‌ల చ‌ర్యల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని ధూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించ‌డ‌మే నేరమా అని ప్రశ్నించారు. త‌ప్పుని త‌ప్పని చెబితే చంపేస్తారా? అని నిలదీశారు. మంచి చెప్పే మ‌నుషుల ప్రాణాలే తీసేస్తారా? అని నిలదీశారు. నిన్న ఒంగోలులో వైశ్యుడైన సొంత‌పార్టీ నేత సుబ్బారావు గుప్తా, నేడు వెంక‌ట‌నారాయ‌ణ‌ రోజుకొక‌రు వైసీపీ ముఠాలకి బ‌ల‌వ్వాల్సిందేనా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అడ్డుకోవాల్సిన పోలీసులేమ‌య్యారు? అని నిలదీశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story