Nara Lokesh: జగన్ రెడ్డి జేసీబీ ఊపులకు భయపడే వారు ఎవరూ లేరు

Nara Lokesh: అధికార పార్టీ పై నిప్పులు కురిపించారు టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్.

Samba Siva Rao
Published on: 25 April 2021 12:34 PM IST
Nara Lokesh Tweets On YCP Govt
X

నారా లోకేష్ ఫైల్ ఫోటో 

Nara Lokesh: అధికార పార్టీ పై నిప్పులు కురిపించారు టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్. ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో జగన్ రెడ్డి బిజీగా ఉన్నారని లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని కూల్చివేతపై స్పందించిన ఆయన.. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అంటూ నినదించి కార్మికుల పక్షాన నిలిచినందుకే పల్లా శ్రీనివాస్‌పై కక్ష చర్యలకు దిగారన్నారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇక మరో ట్వీట్ లో.. ప్రభుత్వం కనీసం నోటీసు ఇవ్వకుండా, చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధవాతవరణంలో భవనాన్ని కూల్చివేయడాన్ని, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి జేసీబీ ఊపులకు భయపడే వారు ఎవరూ లేరని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటికరణ కాకుండా ఉండటానికి టీడీపీ దేనికైనా సిద్ధమేనని నారా లోకేష్ స్పష్టం చేశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story