నారా లోకేష్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఝలక్‌.. జూమ్‌లో ప్రత్యక్షమైన మాజీమంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ

Nara Lokesh Slams Kodali Nani and Vallabhaneni Vamsi Enter into his Zoom Meeting
x

నారా లోకేష్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఝలక్‌..

Highlights

Nara Lokesh Zoom Meeting: టెన్త్‌ విద్యార్థులతో లోకేష్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా ఆ లైవ్‌లో వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు.

Nara Lokesh Zoom Meeting: టెన్త్‌ విద్యార్థులతో లోకేష్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా ఆ లైవ్‌లో వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. 10వ తరగతి విద్యార్థులతో లోకేష్‌ జూమ్ లైవ్‌లో ఉండగా.. మాజీమంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆ లైవ్‌లో పాల్గొన్నారు. లోకేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేయగా జూమ్‌ లైవ్‌ను నిర్వాహకులు కట్‌ చేశారు. అయితే జూమ్‌ మీటింగ్‌లోకి వైసీపీ నేతల ఎంట్రీపై ఘాటుగా స్పందించారు లోకేష్‌. విద్యార్థులను ఫెయిల్‌ చేయడం ప్రభుత్వం చేతగానితనమని.. జూమ్‌లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్‌ చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ సమావేశం నుంచి ఎమ్మెల్యే వంశీ తప్పుకున్నారు. కార్తిక్‌ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories