Nara Lokesh: సీఎం రాజీనామా చేయాలని నారా లోకేష్ డిమాండ్

Nara Lokesh: ఏపీలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో నాటుసారా తయారావుతోందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.

Arun Chilukuri
Published on: 16 March 2022 5:26 PM IST
Nara Lokesh Slams CM Jagan over kalti Sara
X

Nara Lokesh: సీఎం రాజీనామా చేయాలని నారా లోకేష్ డిమాండ్

Nara Lokesh: ఏపీలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో నాటుసారా తయారావుతోందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. మంత్రులు కొందరు కల్తీసారా తాగి చనిపోయారంటున్నారు. సీఎం సహజ మరణాలంటున్నారు. ఏది నిజమని ప్రశ్నించారు నారా లోకేష్. నాటుసారా మరణాలపై అసెంబ్లీలో చర్చకు ఎందుకు పారిపోతున్నారన్నారు. నాటుసారా మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లోకేష్.

పుష్కరాలు అనేది యాక్సిడెంట్. ఇపుడు ప్రభుత్వం నిర్లక్ష్యం, కల్తీ సారాతో మరణించారు. ఎల్జీ పాలిమర్స్ మృతుల కు కోటి ఇచ్చారు. ఇపుడు కనీసం బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించలేదు. అసలు ఆయనకు మానవత్వం ఉందా ఎంతమంది చనిపోతే స్పందిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము సీరియస్ గా ఆందోళన చేస్తుంటే మంత్రులు సభలో జోకులు వేసుకుని నవ్వుతున్నారని చెప్పారు లోకేష్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story