Nara Lokesh: సీఎం ఇంటి ముందే మహిళ ఆత్మహత్యాయత్నం... ఇంతకంటే ఘోరం ఉంటుందా?

Nara Lokesh: సీఎం ఇంటి ముందే మహిళ ఆత్మహత్యాయత్నం... ఇంతకంటే ఘోరం ఉంటుందా?

Arun Chilukuri
Updated on: 2 Nov 2022 8:15 PM IST
Nara Lokesh Respond on Woman Suicide Attempt Incident
X

Nara Lokesh: సీఎం ఇంటి ముందే మహిళ ఆత్మహత్యాయత్నం... ఇంతకంటే ఘోరం ఉంటుందా?

Nara Lokesh: సీఎం జగన్ ఇంటి ముందే న్యాయం కోసం మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంత కంటే ఘోరం ఉంటుందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ పాలనలో సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశే అని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న జగన్‌కు కాకినాడలో వైసీపీ నేతల అరాచకాలు కనబడవని ఆరోపించారు. మంత్రి పేరుతో కబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న కానిస్టేబుళ్లని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర ప్రాణాలు కాపాడాలని, అలాగే అనారోగ్యంతో భాదపడుతున్న ఆరుద్ర కుమార్తె వైద్యానికి కూడా తక్షణమే సాయం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story