Nara Lokesh: మేడికొండూరు అత్యాచార ఘటనపై స్పందించిన లోకేష్

Nara Lokesh: జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన లోకేష్

Sandeep Eggoju
Published on: 9 Sept 2021 10:42 AM IST
Nara Lokesh Responds on Medikonduru Death Case
X

నారాలోకేష్ (ఫైల్ ఇమేజ్)

Nara Lokesh: గుంటూరు అత్యాచార ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. జగన్ పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలోనే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసిందన్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమ పరిధిలోకి రాదని పోలీసులు చెప్పడం ఇంకా ఘోరమన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్ని రాజకీయ కక్ష సాధింపులకు జగన్ వాడుకోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని లోకేష్ దుయ్యబట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story