Nara Lokesh: ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారు..? ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలి..

Nara Lokesh: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌..

Arun Chilukuri
Published on: 10 Aug 2022 7:26 PM IST
Nara Lokesh Respond on Gorantla Madhav Video Forensic Report
X

Nara Lokesh: ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారు..? ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలి..

Nara Lokesh: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌‌కు చెందినదిగా భావిస్తున్న వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నామన్నారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ఎస్పీ ఫకీరప్ప వ్యాఖ్యలను టీడీపీ నేత నారా లోకేష్ తప్పుపట్టారు. ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్ వీడియో ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. మహిళలను కించపర్చే విధంగా వైసీపీ నేతలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాధవ్‌ గురించి ఎస్పీకి బాగా తెలుసునకుంటా అని విమర్శించారు. ఇద్దరూ పోలీసులే కదా అని ఎద్దేవా చేశారు. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయటం ఎంత అనివార్యమో.. మంగళగిరి నుంచి లోకేశ్‌ పోటీ చేయటం కూడా అంతే అనివార్యమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story