CID Notice: చంద్రబాబుకి సీఐడీ నోటీసులపై స్పందించిన లోకేష్

CID Notice: సిల్లీ కేసులతో చంద్రబాబు గడ్డం మీద నెరిసిన వెంట్రుకను కూడా పీకలేరు- లోకేష్

Sandeep Eggoju
Updated on: 16 March 2021 11:44 AM IST
Nara Lokesh Reacts on CID Notices to Chandrababu
X

నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

CID Notice: చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై నారా లోకేష్ స్పందించారు. సిల్లీ కేసులతో చంద్రబాబును ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే అంశమే లేదంటూ కోర్టు అనేకసార్లు చివాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లూ పాడుతారంటూ ఎద్దెవా చేశారు. 21 నెలల పాటు శోధించి అలిసిపోయి. ఆఖరికి రెడ్డిగారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారంటూ మండిపడ్డారు. అమరావతిని అంతం చేయడానికి జగన్ ఎన్ని కుట్రలు చేసినా దైవభూమి తనను తానే కాపాడుకుంటుందన్నారు లోకేష్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story