Nara Lokesh: సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలి

Nara Lokesh: జనవరి 27 నుంచి నారా లోకేష్‌ పాదయాత్ర

Jyothi
Published on: 25 Nov 2022 2:29 PM IST
Nara Lokesh Padayatra from January 27
X

Nara Lokesh: సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలి

Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని కార్యకర్తల సమావేశంలో లోకేష్ అధికారికంగా ప్రకటించారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళగిరిలో 4 రోజులపాటు పాదయాత్ర చేయనున్నారు. మంగళగిరిని టీడీపీ కంచుకోటగా తయారు చేస్తానని లోకేష్‌ తెలిపారు. మంగళగిరి బాధ్యతలు కార్యకర్తలు తీసుకోవాలని లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేశ్‌ నడవనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులు పాదయాత్ర ఉంటుందని.. మిగిలిన రోజుల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు. తనని ఓడించేందుకు సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు లోకేశ్‌ సూచించారు.

Jyothi

Jyothi

Next Story