డ్రైవర్‌ను చంపేసి ఎమ్మెల్సీ పెళ్లిళ్లకు తిరుగుతున్నారు - నారా లోకేష్

Nara Lokesh: కరోనా కేసు విచారణలో భాగంగా కోర్టుకు వచ్చిన లోకేష్‌...

Shireesha
Published on: 23 May 2022 12:37 PM IST
Nara Lokesh on MLC Anantha Udaya Bhaskar Driver Subramanyam Assassination Case | AP Live News
X

డ్రైవర్‌ను చంపేసి ఎమ్మెల్సీ పెళ్లిళ్లకు తిరుగుతున్నారు - నారా లోకేష్

Nara Lokesh: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్, కొల్లు రవీంద్రపై నమోదైన కేసు విచారణలో భాగంగా విజయవాడ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం హత్యకు గురై 72 గంటలైనా నిందితులను పట్టుకోలేరా అని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం హత్య తర్వాత ఎమ్మెల్సీ అన్ని చోట్లకు వెళ్లారని లోకేష్ చెప్పారు. అనంతబాబు.. ప్రభుత్వ సలహాదారు సజ్జలను కూడా కలిశారని అన్నారు. పోలీసులకు మాత్రం అనంతబాబు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.

Shireesha

Shireesha

Next Story