Nara Lokesh: ప్రభుత్వ బడుల్లో ‘నో అడ్మిషన్‌’ బోర్డు పెట్టాలనేదే నా లక్ష్యం

Nara Lokesh:  ప్రభుత్వ బడుల్లో ‘నో అడ్మిషన్‌’ బోర్డు పెట్టాలనేదే నా లక్ష్యం
x
Highlights

Nara Lokesh: ‘మన బడి-మన భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

Nara Lokesh: ‘మన బడి-మన భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే అంశంపై శాసనసభలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.

మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు:

"యువగళం పాదయాత్రలో ఉపాధ్యాయులు తమ సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. మా లక్ష్యం ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడటమే" అని లోకేశ్ స్పష్టం చేశారు.

పాఠశాల భవనాల నిర్మాణం కోసం దాతల సహాయం కోరుతున్నామని, సహకరించిన దాతల పేర్లను భవనాలపై ఉంచుతామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే తమ ఉద్దేశమని, అన్ని ప్రభుత్వ బడుల్లో సీట్లు నిండిపోయి ‘నో అడ్మిషన్’ బోర్డులు పెట్టాలనేది తన లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 100 పాఠశాలల్లో అలాంటి పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories