Nara Lokesh: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసిన నారా లోకేష్‌

Nara Lokesh: చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు..? లోకేష్‌పై ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించిన షా

Shekhar G
Published on: 12 Oct 2023 7:38 AM IST
Nara Lokesh Met Union Home Minister Amit Shah
X

Nara Lokesh: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసిన నారా లోకేష్‌

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని...జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు తెలిపారు లోకేష్‌. ఈ విషయంపై స్పందించిన అమిత్ షా చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్‌ని అడిగి తెలుసుకున్నారు. తమపై పెట్టిన కేసులు, ట్రయల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షా కి వివరించారు.

73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అభిప్రాయపడ్డారు అమిత్ షా. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్న అమిత్ షా...రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నానని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story