లోకేష్ కు తిలకం దిద్దిన బ్రాహ్మణి.. యువగళం యాత్రక బయల్దేరిన లోకేష్..

Nara Lokesh Left for Yuva Galam Padayatra
x

లోకేష్ కు తిలకం దిద్దిన బ్రాహ్మణి.. యువగళం యాత్రక బయల్దేరిన లోకేష్..

Highlights

Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి ఏపీలో యువగళం పాదయాత్ర చేపట్టనున్నారు.

Yuvagalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి ఏపీలో యువగళం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. అంతకుమందు ఇంటి వద్ద లోకేష్ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన సతీమణి నారా బ్రహ్మణి హారతిచ్చారు.

ఆ తర్వాత లోకేష్ ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లారు. మామ బాలకృష్ణ దగ్గరుండి ఆయనను కారు ఎక్కించారు. లోకేష్ ఎన్టీఆర్ ఘాట్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కడప వెళ్లనున్నారు. కడపలోని పలు ఆలయాలు, దర్గా, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని.. కుప్పంకు బయల్దేరనున్నారు. ఎల్లుండి నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories