పోలీసు వాహనాలకు వైసీపీ రంగులా..? : నారా లోకేష్ ధ్వజం

పోలీసు వాహనాలకు వైసీపీ రంగులా..? : నారా లోకేష్ ధ్వజం
x
Highlights

పోలీసు వాహనాలకు వైసీపీ రంగులా అంటూ మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు....

పోలీసు వాహనాలకు వైసీపీ రంగులా అంటూ మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైసీపీ రంగులోకి మార్చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. రంగులతో మహిళలకు రక్షణ రాదు అని ట్వీట్ చేసిన లోకేష్ మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళల్ని వేధిస్తున్న మృగాళ్లను శిక్షస్తే మహిళలు ధైర్యంగా బయటకు వస్తారన్నారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైసీపీ రంగులు కాదు శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృధా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిది అని నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా హితవు పలికారు.


Show Full Article
Print Article
Next Story
More Stories