Nara Lokesh: ఎస్పీ అమ్మిరెడ్డిపై నారా లోకేష్ ఫైర్

Nara Lokesh: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పోస్టు చేశారంటూ ఇద్దరు సీబీఎన్ ఆర్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు.

Arun Chilukuri
Published on: 19 May 2021 4:43 PM IST
Nara Lokesh Fires in Guntur Urban SP Ammireddy
X

Nara Lokesh: ఎస్పీ అమ్మిరెడ్డిపై నారా లోకేష్ ఫైర్

Nara Lokesh: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పోస్టు చేశారంటూ ఇద్దరు సీబీఎన్ ఆర్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ‌ల సొమ్ము జీతంగా తీసుకుని.. తాడేప‌ల్లి కొంప‌కి చాకిరీ చేయ‌డానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. సోష‌ల్‌ మీడియాలో వీడియో పెట్టిన‌ వాళ్లని.. అంత‌ర్జాతీయ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన‌ట్టు ఏంటా ఓవ‌రాక్షన్‌? అని ప్రశ్నించారు.

ఇవే వీడియోలు టీడీపీపై పెట్టిన వారిపై తాము పెట్టిన కేసుల్లో ఇప్పటి వ‌ర‌కు ఎన్నింట్లో అరెస్టులు చేశారో చెప్పాలన్నారు. మంత్రి సీదిరి అప్పల‌రాజుపై కేసు పెట్టడానికి వ‌చ్చిన‌ వారిపైనే రివ‌ర్స్ కేసు బ‌నాయించారని మండిపడ్డారు. జ‌గ‌న్‌రెడ్డి ద‌గ్గర ప‌నిచేయాల‌ని అంత ఉత్సాహం, కుల‌పిచ్చి ఉంటే.. ప‌విత్రమైన ఆ ఖాకీ డ్రెస్ తీసేసి బులుగు కండువా కప్పుకోవాని లోకేష్‌ సూచించారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story