Nara Lokesh: సునీల్ మరణంపై ఎందుకు స్పందించలేదు..సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్

Nara Lokesh ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్.

Samba Siva Rao
Published on: 23 May 2021 7:35 PM IST
Nara Lokesh Fire On Cm Jagan
X

లోకేష్ ఫైల్ ఫోటో 

Nara Lokesh: ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్. సునీల్ అనే వ్య‌క్తి క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించాడు. సునీల్ మరణించడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ సంద‌ర్భంగా లోకేశ్ ప‌లు ట్వీట్స్ చేశారు. ప్రాణం విలువ బాగా తెలిసిన వైఎస్ జ‌గ‌న్ గారూ.. మీరు ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల‌ సునీల్‌ లాంటి అభాగ్యులు ఇప్ప‌టివ‌ర‌కూ 10 వేల‌మందికి పైగానే క‌రోనాతో ప్రాణాలు వ‌దిలారు.

త‌ల్లిని కోల్పోయిన సునీల్ చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతూ కేజీహెచ్ కోవిడ్ వార్డు నుంచే లైవ్ వీడియో పెట్టి, మీ అఫీషియ‌ల్ హ్యాండిల్‌కి ట్వీట్ ట్యాగ్ చేసినా స్పందించ‌లేదు. సునీల్ 19న క‌న్నుమూశాడు. సునీల్ చ‌దువుకున్నాడు కాబ‌ట్టి ట్వీట్ ద్వారా తెలిసింది.

నిర‌క్ష‌రాస్యులు,కార్మికులు, పేద‌లు రోజూ వేల మంది కాపాడాలంటూ ఆర్త‌నాదాలు చేస్తూ మృత్యువాత‌ప‌డుతూనే ఉన్నారు. ప్రాణం విలువ తెలిసిన వారెవ్వ‌రూ స్పందించ‌కుండా ఉండరు జగన్ రెడ్డి గారూ అంటూ లోకేశ్ ట్విట్స్ చేశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story