నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

X
Highlights
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో లోకేష్...
Arun Chilukuri26 Oct 2020 9:55 AM GMT
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో లోకేష్ ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళ్లింది. హటాత్తుగా జరిగిన ఈ ఘటనతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హడలిపోయారు. అయితే, లోకేష్‌తోపాటు ఉన్న ఎమ్మెల్యే మంతెన రామరాజు చాకచక్యంగా ట్రాక్టర్‌ను అదుపు చేయడంతోపాటు ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన ట్రాక్టర్‌లో లోకేష్‌తో పాటు ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు ఉన్నారు. లోకేష్‌తోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
Web TitleNara Lokesh Escaped From an Accident
Next Story