సీఎం జగన్ పై నారా లోకేష్ తీవ్ర విమర్శలు

* తనపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలు * ప్రమాణం చేయడానికి తాను సిద్ధం * సింహాచలం అప్పన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా..?

Sandeep Eggoju
Updated on: 1 Jan 2021 5:18 PM IST
సీఎం జగన్ పై నారా లోకేష్ తీవ్ర విమర్శలు
X

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై దొంగలతో దొంగ ఆరోపణలు చేయడం కాదని సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధికి స్వయంగా సీఎం జగన్ వస్తే తేల్చుకుందామని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని ప్రమాణం చేయ్యడానికి తాను సిద్ధమని అందుకు సీఎం జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. ఏ1 క్రిమిన‌ల్ సీఎం త‌న‌ డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగ‌రెడ్డితో దొంగ ఆరోప‌ణ‌లు చేయిస్తున్నారని మండిపడ్డారు. దొంగ‌ల బ్యాచీతో చేయించే ఆరోప‌ణ‌లూ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలిందంటూ ఘాటుగా విమర్శించారు. ఎన్నాళ్లీ దొంగల‌తో దొంగ ఆరోప‌ణ‌లు జ‌గ‌న్‌ రెడ్డీ అంటూ ట్వీట్ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story