Nara Lokesh: తిరుమలలో ఘనంగా దేవాన్ష్ బర్త్ డే

Nara Lokesh: చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు.

Kranthi
Published on: 21 March 2021 12:09 PM IST
Nara Lokesh: Chandrababu Grandson Devansh Birthday in Tirumala
X

Nara Lokesh:(ఫైల్ ఇమేజ్) 

Nara Lokesh: మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మనువడు, నారా లోకేష్, బ్రహ్మణి కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు(మార్చి21)ను తిరుమలలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ.30లక్షలు విరాళంగా అందజేశారు. గత నాలుగేళ్లుగా దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను తిరుమలలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఆదివారం ఉదయం స్వామివారి ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు అధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్‌లు, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్ 17న ఉప-ఎన్నిక జరగనుండగా.. చంద్రబాబు తిరుమలకు రావడంతో రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాలను ఆయన లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Kranthi

Kranthi

Next Story