Chandrababu Arrest: సెప్టెంబర్‌ 30న ‘మోత మోగిద్దాం’.. వినూత్న కార్యాచరణకు నారా లోకేష్ పిలుపు..

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నారా లోకేష్ మోత మోగిద్దాం అంటూ వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చారు.

Arun Chilukuri
Updated on: 29 Sept 2023 7:15 PM IST
Nara Lokesh Calls for Innovative Protest Tomorrow
X

Chandrababu Arrest: సెప్టెంబర్‌ 30న ‘మోత మోగిద్దాం’.. వినూత్న కార్యాచరణకు నారా లోకేష్ పిలుపు..

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నారా లోకేష్ మోత మోగిద్దాం అంటూ వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ఐదుకోట్ల ఆంధ్రులు ఈనెల 30న శనివారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ఐదు నిమిషాలు ఉన్నచోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దామన్నారు. ఇంట్లోనో, ఆఫీసులోనో, ఇంకెక్కడ ఉన్నా... బయటికొచ్చి గంట లేదా ప్లేటు మీద గరిటెతో కొట్టండి.. లేదా విజిల్ వేయండి.. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టండి.. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండని లోకేష్ సూచించారు. అక్రమ అరెస్ట్ చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దామని పేర్కొన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దామన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story