AP News: తిరుమల శ్రీవారి సేవలో నారా ఫ్యామిలీ

AP News: ఒక్క రోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.38 లక్షల చెక్కును ఇచ్చిన లోకేష్

Shashank Gullapelli
Published on: 21 March 2024 11:37 AM IST
Nara Family In Tirumala Srivari Seva
X

AP News: తిరుమల శ్రీవారి సేవలో నారా ఫ్యామిలీ 

AP News: తిరుమలలో నారా లోకేష్ కుటుంబం సందడి చేసింది. నేడు లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. తల్లి భువనేశ్వరి.. భార్య బ్రాహ్మిణిలతో తిరుమలకు వచ్చిన లోకేష్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం.. ఈరోజు తిరుమలలో ఒక్క రోజు అన్నదానికి అయ్యే 38 లక్షల రూపాయల చెక్కును టీటీడీ అధికారులకు అందించారు. ఉదయం అల్పాహారం సమయంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. అన్నదాన సత్రంలో లోకేష్ దంపతులు సందడి చేయటంతో.. భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story