నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదు.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై భువనేశ్వరి లేఖ

Nara Bhuvaneswari: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి...

Arun Chilukuri
Published on: 26 Nov 2021 12:26 PM IST
Nara Bhuvaneswari Released Letter Over AP Assembly Incident
X

నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదు.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై భువనేశ్వరి లేఖ

Nara Bhuvaneswari: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వరి ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి తనకు అండగా నిలబడటాన్ని మర్చిపోలేనని పేర్కొన్నారు.

చిన్నతనం నుంచి తమ అమ్మగారు, నాన్నగారు తమను విలువలతో పెంచారని గుర్తు చేశారు. నేటికీ తాము వాటిని పాటిస్తూనే ఉంటామని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. విలువలతో కూడిన సమాజం కోసం అందరూ కృషి చేయాలి. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం ఎవరికీ జరగకూడదు అని భువనేశ్వరి పేర్కొన్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story