Nara Bhuvaneshwari: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంతో జనంలోకి భువనేశ్వరి

Nara Bhuvaneshwari: నిజం గెలవాలిపేరుతో నారా భువనేశ్వరి పర్యటనలు

Jyothi
Published on: 19 Oct 2023 8:35 AM IST
Nara Bhuvaneshwari will go public
X

Nara Bhuvaneshwari: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంతో జనంలోకి భువనేశ్వరి

Nara Bhuvaneshwari: రాష్ట్రంలో వరుసగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

అలాగే చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని టీడీపీ నిర్ణయించింది. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో జనంలోకి వెళ్లనున్నారు నారా లోకేష్. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

బాబుతో నేను కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల స్పీడు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. ఓవైపు కోర్టుల్లో చంద్రబాబు బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తూనే, మరో వైపు ప్రజా కోర్టులో వైసీపీ పై పోరాడాలని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ వరుసగా కార్యక్రమాలు నిర్వహించడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Jyothi

Jyothi

Next Story