శ్రీశైలంలో పరోక్షసేవగా నందీశ్వరస్వామికి విశేష పూజలు

Srisailam: ప్రతినెలలో శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజుల్లో సర్కారీ సేవగా పూజ కైంకర్యం

Jyothi
Published on: 24 Sept 2022 8:58 AM IST
Nandeeshwara Swamy is Paroksha Seva in Srisailam Temple
X

శ్రీశైలంలో పరోక్షసేవగా నందీశ్వరస్వామికి విశేష పూజలు

Srisailam: శ్రీశైల మల్లన్న క్షేత్రంలో త్రయోదశి సందర్భంగా ఆలయంలోని నందీశ్వరస్వామికి పరోక్షసేవగా విశేషార్చన అభిషేకం నిర్వహించారు. సర్కారీసేవగా ఈ పూజ కైంకర్యం నిర్వహించారు. ప్రతి నెలలో శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామి పూజను పరోక్షసేవగా, జరిపించుకునే దేవస్థానం అవకాశం కల్పించింది. నందీశ్వర పరోక్షసేవలో మహాగణపతిపూజ, నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతో, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. ఈ పరోక్షాసేవలో ఆలయ ఈవో లవన్న భక్తులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story