Pawan Kalyan: బాబూ.. పొత్తు కావాలంటే తగ్గండి..

Pawan Kalyan: బాబూ.. పొత్తు కావాలంటే తగ్గండి..
x

Pawan Kalyan: బాబూ.. పొత్తు కావాలంటే తగ్గండి.. 

Highlights

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం చేసినా అది సంచలనమే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం చేసినా అది సంచలనమే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమంటూ ఆయన రాజకీయాన్ని మొదలుపెట్టిన జనసేనాని రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి జైకొడితే ఆయన అభిమానులు అందుకు సై అన్నారు. 2019 నేర్పిన పాఠాలతో 2024లో రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని పవన్ నిర్ణయానికి వచ్చారు. అందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు జనసేనాని. 2024కు మూడు ఆప్షన్లంటూ తాజాగా ప్రకటించారు పవన్. టీడీపీ నేతలకు చెక్ పెట్టేలా తాజా స్టేట్మెంట్ ఉందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడం లేదంటే బీజేపీ-టీడీపీతో కలిసి పోటీ చేయడం చివరి ఆప్షన్ గా ఒంటరిగా బరిలో దిగుతామంటూ మూడు సూత్రాల ప్రణాళిక ఆవిష్కరించారు.

ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలంటే పొత్తు పొడవాల్సిందేనని జనసేనాని కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. పొత్తు లేకుండా టీడీపీ గెలవదన్న దీమాకు పవన్ వచ్చినట్టు కన్పిస్తోంది. పొత్తు కుదరాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ తప్పవన్నారు. అందరూ కలిసి పోటీ చేస్తేనే ఎన్నికల్లో వైసీపీని ఓడించగలుగుతామన్నారు. అందుకు టీడీపీ రాజీపడాల్సిన అవసరం ఉందని సంకేతాలిచ్చారు. కలిసి రావాలంటూ తేల్చిచెప్పారు పవన్. మొత్తంగా ఏపీ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ అందుకు తగిన విధంగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు ఢిల్లీ బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతూనే మరోవైపు పొత్తు లెక్కలు వేస్తున్నారు జనసేనాని.

మొత్తంగా పొత్తు కావాలంటే అందుకు టీడీపీ తగ్గాల్సిందేనని స్పష్టం చేశారు పవన్. 150 సీట్లు గెలుస్తామంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు పవన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ 150 ప్లస్ వ్యాఖ్యలపై జనసేనాని గుర్రుగా ఉన్నారు. టీడీపీ తగ్గితేనే పొత్తు పొడుస్తుందన్న సంకేతాన్నిచ్చేశారు. 2024లో జనసేన తగ్గబోదన్న ఫుల్ క్లారిటీ ఇస్తూనే భవిష్యత్ నిర్ణయం మూడు పార్టీల చేతిలో ఉందన్నారు. జనసేన అన్నింటికీ సిద్ధంగా ఉందన్నారు. తనను తాను తగ్గించుకున్నోడే హెచ్చింపబడతాడంటూ బైబిల్ సూత్రాన్ని పాటించాలన్నారు. వార్ వన్ సైడ్ అయ్యిందని టీడీపీ అధినేత అంటున్నారని గతంలో వన్ సైడ్ లవ్ ఇప్పుడు వార్ వన్ సైడ్ ఎలా సాధ్యమవుతాయన్నారు. టీడీపీ ఏ మాట మీద నిలబడుతుందో స్పష్టం చేయాలన్నారు పవన్.

Show Full Article
Print Article
Next Story
More Stories