Nagari MLA Roja drives 108 vehicle : 108 వాహ‌నాన్ని న‌డిపిన ఎమ్మెల్యే రోజా

Arun Chilukuri
Published on: 7 July 2020 3:47 PM IST
Nagari MLA Roja drives 108 vehicle : 108 వాహ‌నాన్ని న‌డిపిన ఎమ్మెల్యే రోజా
X

Nagari MLA Roja drives 108 vehicle : నగరి ఎమ్మెల్యే రోజా 108 వాహనాన్ని నడిపారు. న‌గ‌రి పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్ర‌హం వ‌ద్ద 108,104 అంబులెన్సు వాహ‌నాల‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. దీనిలో భాగంగా 108 వాహ‌నాన్ని రోజా స్వ‌యంగా న‌డిపారు. కరోనా కాలంలో ప్రజలకు భరోసాని ఇవ్వలేని చంద్రబాబు.. అవినీతి పరులైన నేతలను అరెస్ట్ చేస్తే మాత్రం రోడ్డు మీదకు వచ్చారని విమర్శలు గుప్పించారు రోజా. మాట్లాడితే అచ్చెన్నాయుడు బీసీ అంటున్నారని.. ఆయన బీసీ, ఎస్టీ, ఎస్సీల డబ్బులను దోచుకోలేదా అని ప్రశ్నించారు.

కొల్లు రవీంద్రను అరెస్ట్ చేస్తే కక్షసాధింపు అంటూ విమర్శిస్తున్నారని మరి ఆయన చంపిన భాస్కర్ రావు ఏ కులపు వారో చెప్పాలని ఈ సందర్భంగా నిలదీశారు రోజా. చంద్రబాబు తీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర సేవ‌లందించే 108,104 వాహ‌నాల‌ను అత్యాధునిక సౌక‌ర్యాల‌తో జూలై 1న 1008 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఒకేసారి ప్రారంభించిన సంగ‌తి తెలి‌సిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story