MLA RK Roja : జబర్దస్త్ రోజానా మజాకా.. బైక్ అంబులెన్స్ నడిపిన నగరి ఎమ్మెల్యే!

RK Roja ride bike ambulance
MLA RK Roja : ఆ మధ్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించినప్పుడు సినీ నటి, నగరి ఎమ్మెల్యే
MLA RK Roja : ఆ మధ్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించినప్పుడు సినీ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంబులెన్స్ ను నడిపి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఎమ్మెల్యే రోజా కోరిక మేరకు శ్రీ సిటీ హీరో మోటార్స్ కంపెనీ రెండు బైక్ అంబులెన్స్ వాహనాలను అందించింది. వీటిని రోజా తన నియోజకవర్గంలో ఈ రోజు ప్రారంభించారు.
అయితే వాటిని స్వయంగా రోజానే నడిపి ప్రారంభించడం విశేషం.. ఈ రెండు బైక్ అంబులెన్స్ లను నగరి, పుత్తూరు ప్రభుత్వాసుపత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా హీరో మోటార్స్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దర్జాగా రోజా డ్రైవ్ చేస్తూ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.