MLA Roja: వైసీపీ నేతలపై ఎస్పీకి రోజా ఫిర్యాదు.. క్రిమినల్ కేసులు..

MLA Roja: చిత్తూరు జిల్లా నగరి రాజకీయం ముదిరి పాకాన పడుతోంది. ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీ నుంచి సెగ తగులుతోంది.

Arun Chilukuri
Updated on: 31 Dec 2021 5:21 PM IST
Nagari MLA RK Roja Complaint to SP Senthil Kumar on YSRCP Leaders
X

MLA Roja: వైసీపీ నేతలపై ఎస్పీకి రోజా ఫిర్యాదు.. క్రిమనల్‌ కేసులు..

MLA Roja: చిత్తూరు జిల్లా నగరి రాజకీయం ముదిరి పాకాన పడుతోంది. ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీ నుంచి సెగ తగులుతోంది. సర్దుబాటు కోసం శాయశక్తులా ప్రయత్నించిన రోజా యుద్ధానికి సిద్దమైంది. అమీతుమీకి దిగింది. నియోజకవర్గంలోని కొందరు నేతలు మంత్రులు, డీజీపీతో ఫొటోలు దిగి వాటిని తప్పుడు పద్ధతుల్లో వినియోగించుకుంటున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

నగరి నియోజకవర్గ వైసీపీలో చాలా కాలంగా విభేదాలు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒకరిద్దరు నేతలు రోజాను వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలోని సొంత పార్టీ పెద్దల అండదండలుండటంతో ఎమ్మెల్యేపై వారు బహిరంగ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రోజాకు నియోజకవర్గంలో వ్యతిరేక వర్గం తయారైంది. అంతేకాదు వారు బలపడటానికి పావులు కదుపుతూ రోజాపై విమర్శలు చేస్తున్నారు.

ఇది గ్రహించిన ఎమ్మెల్యే రోజా రంగంలోకి దిగారు. తనపై, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందుకు డీజీపీ, మంత్రుల ఫోటోను వాడుకుంటున్నారని ఎస్పీకి కంప్లైంట్‌ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న మంత్రి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story