AP News: ఏపీ టెన్త్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నాగ సాయి మనస్వి

AP News: మనస్వి ఘనంగా సన్మానించిన నారాయణ స్కూల్ ఉపాధ్యాయులు

Shashank Gullapelli
Published on: 22 April 2024 5:52 PM IST
Naga Sai Manasvi Has Secured State First Rank In AP 10th Results
X

AP News: ఏపీ టెన్త్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నాగ సాయి మనస్వి

AP News: ఇవాళ విడుదలైన ఏపీ టెన్త్ ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది. హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి. మనస్వి ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. స్టేట్ టాపర్‌గా నిలవడం పట్ల సాయి మనస్వి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నాగ మనస్విని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. తమ పాఠశాల చరిత్రలో నిలిచిపోయేలా 600కు 599 మార్కులు రావడం గర్వంగా ఉందన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story