విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం

Vijayawada: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 1 July 2022 6:51 PM IST
Nadendla Manohar Meets Vangaveeti Radha
X

విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం

Vijayawada: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను కలిశారు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌. ఆదివారం MBVK భవన్‌లో జనసేన జనవాణి కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు నాదెండ్ల మనోహర్‌. అయితే పక్కనే రాధా ఆఫీస్‌ ఉండటంతో ఆయన్ను కలిసేందుకు వెళ్లారు నాదెండ్ల.

విషయం తెలుసుకున్న రాధా నాదెండ్ల మనోహర్‌కు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు చర్చించారు. ఇదిలా ఉంటే జనసేనలో రాధా చేరుతారంటూ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో నాదెండ్ల మనోహర్‌, వంగవీటి రాధా భేటీపై రాజకీయంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story