విశాఖ సాయి ప్రియ మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. ప్రియుడితో నెల్లూరులో ఉందని గుర్తించిన బంధువులు

Saipriya: విశాఖ సాయి ప్రియ మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్ నెలకొంది.

Arun Chilukuri
Published on: 27 July 2022 1:28 PM IST
Mystery Revealed Missing of Woman at RK Beach in Visakhapatnam
X

విశాఖ సాయి ప్రియ మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. ప్రియుడితో నెల్లూరులో ఉందని గుర్తించిన బంధువులు

Saipriya: విశాఖ సాయి ప్రియ మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్ నెలకొంది. ప్రియుడితో నెల్లూరులో ఉందని యువతి బంధువులు గుర్తించారు. నెల్లూరుకు చెందిన రవితో సాయి ప్రియ ప్రేమ వ్యవహారం సాగిస్తోంది. అయితే సోమవారం పెళ్లిరోజు కావడంతో భర్తతో కలిసి విశాఖ బీచ్‌కు వెళ్లిన సాయి ప్రియ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో సముద్రంలో గల్లంతైందని భావించిన భర్త పోలీసులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భర్తపైనా అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు చివరకు ప్రియుడితో సాయి ప్రియ వెళ్లిపోయిందని నిర్ధారణకు వచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story