దివ్య హత్యకేసులో వీడని మిస్టరీ.. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు

దివ్య హత్యకేసులో వీడని మిస్టరీ.. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు
x
Highlights

విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వి హత్యకేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. కేసుపై అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసుల...

విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వి హత్యకేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. కేసుపై అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మార్చి 28న నాగేంద్రకు దివ్య కాల్‌ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 2న చివరిసారిగా దివ్యకు నాగేంద్ర ఫోన్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

2018 మార్చిలో మంగళగిరిలోని ఓ ఆలయానికి దివ్య, నాగేంద్ర వెళ్లారని అయితే వారి వివాహంపై ఆలయంలో ఎలాంటి వివరాలు నమోదు కాలేదని పోలీసులు గుర్తించారు. దివ్య మెడలో తాళి కట్టి ఇద్దరు ఫొటోలు దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు దివ్య, నాగేంద్ర మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, మహిళ ఆచూకీ కోసం దివ్య చదువుకున్న విష్ణు కాలేజీకి వెళ్లి ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే నాగేంద్ర, దివ్య కామన్‌ ఫ్రెండ్స్‌ను కూడా విచారిస్తున్నారు పోలీసులు. మరోవైపు దివ్య హత్య కేసును దిశా పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు పోలీసులు. అలాగే ఘటనపై విచారణను కొనసాగిస్తున్నారు పోలీసులు. దివ్య తల్లిదండ్రులను విచారిస్తున్న పోలీసులు దివ్య, నాగేంద్ర రహస్య ప్రేమ వివాహంపై ప్రశ్నిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories