AP Elections: ఊపందుకున్న మున్సిపల్‌ ఎన్నికల జోరు

AP Elections: ఇవాళ విజయవాడలో చంద్రబాబు పర్యటన * మూడు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం

Sandeep Eggoju
Published on: 7 March 2021 8:26 AM IST
Municipal Elections Campaign Is on the Fast Track
X

Representational Image

AP Elections: ఏపీలో మున్సిపల్‌ ఎలక్షన్ల నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షం వ్యూహాలు రచిస్తుండగా.. జగన్‌ పాలనలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తుస్తోంది వైసీపీ.

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇవాళ విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. చంద్రబాబుతో పాటు.. ప్రచారంలో మూడు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రచారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ శ్రేణులు.

మరోవైపు విజయవాడ టీడీపీలో నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఎంపీ కేశినేని నానితో గత కొన్ని రోజులుగా విసిగిపోయామని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బోండా ఉమా మండిపడుతున్నారు. రంగా హత్య కేసులో ఉన్న ముద్దాయిని.. కేశినేని ప్రచారంలో తిప్పుతున్నారని విమర్శించారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపారన్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఇవాళ్టి చంద్రబాబు టూర్‌కు కేశినేని నాని దూరంగా ఉండనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story