నన్ను, నా భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారు ... రాజకీయాలు వదిలేద్దామనుకున్నా- ఎమ్మెల్యే పొన్నాడ

Ponnada Satish Kumar: ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Jyothi
Published on: 28 Jun 2022 12:06 PM IST
Mummidivaram MLA Ponnada Satish Kumar Key Remarks
X

ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Ponnada Satish Kumar: వైసీపీ అమలాపురం నియోజకవర్గ ప్లీనరీలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను, తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూశారని, దీంతో రాజకీయాల్లో కొనసాగడం సరికాదని భావించానని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అన్నారు. మంత్రి విశ్వరూప్‌తో పాటు తనను అంతమొందించేందుకు కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు కుట్ర పన్నారని ఆరోపించారు. అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లాలో తమకంటే ప్రజలకే ఎక్కువ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక్కడికి పరిశ్రమలను, ప్రాజెక్టులను తీసుకురావాలని అనుకున్నామని, తమనే తగలబెట్టాలని చూసిన ఇక్కడికి పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లా పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు.

Jyothi

Jyothi

Next Story