Tirumala: శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. దేశ ప్రజలందరికీ...
Mukesh Ambani: తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు.
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. దేశ ప్రజలందరికీ...
Mukesh Ambani: తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అంబానీకి పండితులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలందరికీ శ్రీవారి ఆశీస్సులు కలగాలని కోరుకున్నానని తెలిపారు. ప్రతి ఏడాది తిరుమలలోని శ్రీవారి ఆలయం అభివృద్ధి చెందుతూ.. మెరుగవుతూ ఉందన్నారు. మాకు అందరి ఆశీస్సులు ఉండాలని వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించానని అన్నారు పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ.
Next Story




