Mudragada Padmanabham: కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

Mudragada Padmanabham: కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు.

Arun Chilukuri
Published on: 8 Aug 2022 3:55 PM IST
Mudragadda Padmanabham Welcomes Ambedkar Name to Konaseema
X

Mudragada Padmanabham: కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

Mudragada Padmanabham: కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. కోనసీమ పెద్దలకు ఓ లేఖ రాశారు. మన మట్టిలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్‌ను, యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచమే కొనియాడుతుందన్నారు. అటువంటి మహావ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించడం న్యాయంగా లేదన్నారు. వీరి పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన ఎవ్వరూ కాదనలేని పరిస్థితి అని, తన భావనను ముద్రగడ పద్మనాభం వ్యక్తం చేశారు. నిజానికి కోనసీమకు జి.యమ్.సి బాలయోగి పేరు పెట్టాలి. ఆయన లోక్సభ స్పీకర్ అయిన తరువాతనే మీ ప్రాంతం అభివృద్ధికి కారణమని చెప్పక తప్పదు. అయితే ప్రభుత్వం ఏదొక ఒక కారణంతో బాలయోగి పేరును పరిగణనలోనికి తీసుకోలేదన్నారు ముద్రగడ.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story