Mudragada Padmanabham: చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ

*మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్యాయత్నం విరమించుకున్నాను ముద్రగడ *ఆస్తులు, పదవులు ఎవరికీ శాశ్వతం కాదు -ముద్రగడ

Shilpa
Published on: 23 Nov 2021 12:04 PM IST
Mudragada Padmanabham Wrote a Letter to Chandrababu Naidu
X

చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ(ఫైల్ ఫోటో)

Mudragada Padmanabham: చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాశారు. తన సతీమణికి అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించిందని లేఖలో పేర్కొన్నారు.

నాడు తన కుటుంబానికి చంద్రబాబు చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అయితే చంద్రబాబు పతనం చూడాలనే ఆత్మహత్యాయత్నం విరమించుకున్నట్లు తెలిపారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి తన కుటుంబ సభ్యులను బూతులు తిట్టడం చంద్రబాబుకు గుర్తు లేదా అని ముద్రగడ ప్రశ్నించారు.

చంద్రబాబు పుత్రరత్నం తరచూ పోలీసులకు ఫోన్ చేసి అవమానించమన్నట్లు తెలిపారు. రాజమండ్రి ఆసుపత్రిలో తమను 14 రోజులు నిర్భందించి రాక్షసానందం పొందారని మండిపడ్డారు. ఆస్తులు, పదవులు ఎవరికీ శాశ్వతం కాదని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.




Shilpa

Shilpa

Next Story