Mudragada: పేరు మార్చుకుంటున్న ముద్రగడ.. ఇకపై “పద్మనాభరెడ్డి”

ఎన్నికల్లో పవన్ గెలిస్తే.. పేరు మార్చుకుంటానని పద్మనాభం సవాల్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2024 10:37 AM IST
Mudragada Padmanabham To Change His Name After Pawan Kalyan
X

Mudragada: పేరు మార్చుకుంటున్న ముద్రగడ.. ఇకపై “పద్మనాభరెడ్డి”

Mudragada Padmanabham: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల్లో పవన్ గెలిస్తే.. పేరు మార్చుకుంటానని పద్మనాభం సవాల్ చేశారు. సవాల్‌లో ఓడిపోయినట్టు అంగీకరించిన పద్మనాభం.. తాజాగా అందుకు గెజిట్ అప్లికేషన్‌ను రెడీ చేసుకున్నారు. పవన్‌తో చేసిన సవాలులో ఓడిపోయినందుకు ఇకపై తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకునేందుకు గెజిట్ పబ్లికేషన్ లో అప్లికేషన్ దాఖలు చేశారు.

తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు. ఇక తనను ఉప్మా పద్మనాభం పదే, పదే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పు లేదన్నారు. తన తాతలు, తండ్రి కాలం నుంచి ఈ ఆనవాయితీ వస్తుందన్నారు. జనం కోసం కష్టపడ్డ జగన్‌ను గౌరవించకపోవడం బాధాకరమని.. ఇకపై తన రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుందని స్పష‌్టం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story