ఆ ఊళ్లో బురద పండగ.. ఎంతటి వారైనా బురద పూసుకోవాల్సిందే..!


సాధారణంగా బురదను చూసి మనం అసహ్యించుకుంటాం చీదరించుకుంటాం, కానీ ఆ గ్రామంలో బురద ఒక పండగ. ఒంటికి బురద రాసుకుని నృత్యాలు చేయడం పండగ ఆనవాయితీ అంతే కాదు ఆ...
సాధారణంగా బురదను చూసి మనం అసహ్యించుకుంటాం చీదరించుకుంటాం, కానీ ఆ గ్రామంలో బురద ఒక పండగ. ఒంటికి బురద రాసుకుని నృత్యాలు చేయడం పండగ ఆనవాయితీ అంతే కాదు ఆ ఊరికో గ్రామ దేవత కూడా ఉంది ఆమె పేరే బురదమాంబ. విశాఖలో రెండేళ్ల కోసారి జరిగే ఈ బురద ఉత్సవం విశేషాలపై స్పెషల్ రిపోర్ట్.
విశాఖ జిల్లా, యలమంచిలి లో దిమిలి గ్రామంలో రెండేళ్ల కు ఒకసారి వచ్చే బురదమాంబ పండుగ చాలా ప్రత్యేకం ఎక్కడైన గ్రామ దేవతలకు పూలు, పళ్లు, లేదా పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు చేస్తారు. కాని దిమిలి గ్రామస్తులు ఊరిలో వున్న మురుగు కాలువల నీటీలో వేప కొమ్మలను ముంచి వాటిని ఒంటికి రాసుకుని పండుగ చేసుకంటారు. ఈ ఆచారం వెనుక ఓ కథ కూడా వుంది.
పూర్వం దిమిలి గ్రామంలో ఓ ఆడపిల్ల అర్ధరాత్రి దారితప్పి వచ్చిందని, ఆమెను కొందరు ఆకాతాయిలు అడ్డగించి బలత్కారం చేయబోతే వారి నుండి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి ఓ మురుగుగుంట లో బురద ను ఒంటికి పూసుకుందట. అయితే అది గమనించిన గ్రామస్థులు ఆమెను రక్షించాలని ప్రయత్నించాగా ఆమె భయంతో స్థానికంగా వున్న బావిలోనికి దూకి ప్రాణాలు విడిచిదంట. అయితే తరువాత అక్కడే ఆమె దేవత విగ్రహం రూపంలో గ్రామస్థులకు దొరకడంతో ఆమెను ప్రతిష్టించుకుని బురద తోనే అమ్మవారిని ఊరంతా చూసారు కాబట్టి బురదమాంబ గా పిలుస్తూ కోలుస్తు వున్నారట. అయితే తనను రక్షించాలని చూసిన గ్రామస్థులను తాను కాపాడుకోవాలని అమ్మవారు ఆ ఊరిలో దేవతగా ప్రతిష్టంచబడి పూజలు అందుకుంటుందట. అందుకే దిమిలి గ్రామస్తులు ప్రతి రెండేళ్లకు ఒకసారి బురదమాంబ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
అయితే ఈ బురద ఉత్సవం లో మరో ప్రత్యేకత కూడా వుంది. ఊరిలో వున్న ప్రతి మగవారు చిన్నా, పెద్ద బురద పూసుకునే ఘట్టంలో పాల్గోనాలి, మహిళలకు మాత్రం అనుమతి లేదు. బురద ఉత్సవం ముగిసిన తరువాత ఊరి ప్రజలంతా అమ్మవారి ఆలయం కు చేరుకుని మహిళలు పసుపు కుంకుమలు, నైవేద్యాలు సమర్పించి ఉత్సవంలో పాల్గోంటారు. ఇలా బురదమాంబ ఉత్సవంలో ఎవరైనా పాల్గోనకపోతే అరిష్టం జరుగుతుందని ఆ గ్రామస్థులు నమ్ముతారు. ఎంతటి వారు అయినా ఈ బురద ఉత్సవంలో పాల్గోని తీరాల్సిందేనని ఊరి అనవాయితీ కూడా అందుకే పండుగ కు ప్రతి ఏటా పెద్ద ఎత్తున దిమిలి గ్రామానికి గ్రామస్తులు చేరుకుంటారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire