Andhra Pradesh: ఎంపీపీ, జెడ్పీ ఎన్నికకు నోటిఫికేషన్

* నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ఎస్ఈసీ * ఈనెల 24న ఎంపీపీ, 25న జెడ్పీ సభ్యుల ఎన్నిక * ఎంపీపీ ఎన్నికకు షెడ్యూల్

Sandeep Reddy
Updated on: 20 Sept 2021 3:33 PM IST
MPP and ZP Chairman Election Notification Released in Andhra Pradesh
X

ఎస్ఈసీ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: ఏపీలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిషికేషన్ విడుదలైంది. ఎంపీపీ ఎన్నికకు సంబంధించి 24వ తేదీ ఉదయం 10గంటల లోపు నామినేషన్లు స్వీకరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12గంటల లోపు తుది జాబితా విడుదల చేస్తారు. ఇక మధ్యాహ్నం ఒంటి గంట కల్లా నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక సమావేశంలో సభ్యులను ఎన్నుకుంటారు.

ఇక జడ్పీ ఎన్నికకు సంబంధించి 21న నోటీసులు ఇస్తారు. అదే రోజు ఉదయం 10గంటల లోపు నామినేషన్లు స్వీకరిస్తారు. 25వ తేదీ మధ్యాహ్నం 12గంటలలోపు తుది జాబితాను విడుదల చేస్తారు. ఒంటి గంట కల్లా నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక సమావేశంలో సభ్యులను ఎన్నుకుంటారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story