వ్యంగ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

Vijaysai Reddy: చంద్రబాబు, పురంధేశ్వరిపై ఆరోపణలు

Shekhar G
Updated on: 31 Aug 2023 5:45 PM IST
MP Vijayasai Reddy Tweet Is Sarcastic
X

వ్యంగ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

Vijaysai Reddy: ఏపీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధ్వేశ్వరిపై, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పార్టీలు వేరైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరుండాలో చంద్రబాబే డిసైడ్ చేస్తారని అందులో పేర్కొన్నారు. ఒక్క సోము వీర్రాజు తప్ప.. అందరూ చంద్రబాబు కోరుకున్న వారే బీజేపీ స్టేట్ చీఫ్ గా అయ్యారని అన్నారు. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును చంద్రబాబు అర్థంతరంగా తప్పించి...తన వదినమ్మ పురంధేశ్వరిని తెరపైకి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. కేంద్ర నాయకత్వం పొత్తుకు అంగీకరించకున్నా.. బీజేపీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబే పంపిస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.


Shekhar G

Shekhar G

Next Story