Vijayasai Reddy: కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను కలిసిన ఎంపీ విజయసాయి

Vijayasai Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం, ఏపీ సమస్యలపై చర్చ

Sandeep Eggoju
Updated on: 9 July 2021 1:03 PM IST
MP Vijayasai Reddy Meeted the Jal Shakti Minister Shekhawat,
X

కేంద్ర జల్ శక్తి మంత్రిని కలసిన విజయసాయి రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Vijayasai Reddy: ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంతో పాటు ఏపీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతివ్వాలని, అలాగే కేఆర్‌ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని మంత్రిని కోరినట్టు విజయసాయి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, చట్టప్రకారం వారికి కేటాయించిన కృష్ణా జలాలను మాత్రమే వాడుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్టు వివరించారు. వీటన్నింటికీ షెకావత్‌ సానుకూలంగా స్పందించారని అన్నారు విజయ సాయిరెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story