చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డలోకి ప్రవేశించారు : విజయసాయిరెడ్డి

X
Highlights
* ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ధోరణి సరిగాలేదని ముందే చెప్పాం -విజయసాయిరెడ్డి * చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డలోకి ప్రవేశించారు -విజయసాయిరెడ్డి
Arun Chilukuri29 Jan 2021 10:02 AM GMT
ఎస్‌ఈసీ, చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. నిమ్మగడ్డ ధోరణి మొదటి నుంచి సరిగాలేదని ముందే చెప్పామని నిమ్మగడ్డ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. నిమ్మగడ్డను ఎర్రగడ్డకు తరలించాలని, రాజ్యాంగ పదవికి నిమ్మగడ్డ అనర్హుడని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి.
చంద్రబాబుతో నిమ్మగడ్డ లాలూచీ పడ్డారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. పంచాయతీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబుపై చర్యలేవని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డలోకి ప్రవేశించారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు.. పంచాయతీ ఎన్నికలు పార్టీపరంగా జరగవన్న విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.
Web TitleMP Vijayasai reddy Comments on SEC, Chandrababu
Next Story