Visakhapatnam: అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ విజయసాయి శంకుస్థాపన

Visakhapatnam: చీమలాపల్లిలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న కన్వెన్షన్ హాలుకు శంకుస్థాపన

Sandeep Eggoju
Updated on: 14 Oct 2021 5:04 PM IST
MP Vijaya Sai Reddy Concreting for Convention Hall in Visakhapatnam
X

ఎంపీ విజయసాయి రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: స్టీల్ సిటీ విశాఖకు మరింత అభివృద్ధి చేస్తామన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. విశాఖలోని చీమలాపల్లి గ్రామంలో 2 కోట్లతో నిర్మిస్తున్న కన్వెన్షన్ హాలు, చిన్నముసిడివాడలోని సత్య నగర్‌ కాలనీలో మరో రెండు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పార్కుకు మంత్రి అవంతితో కలిసి శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండు కళ్లుగా భావించి సుపరిపాలన అందిస్తున్నారన్నారు విజయసాయి రెడ్డి. అలాగే, రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story