MP Vallabhaneni Balasouri: జనసేనలోకి వైసీపీ ఎంపీ.. నేడు పవన్‌ కల్యాణ్‌తో భేటీ

MP Vallabhaneni Balasouri: ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి

Shekhar G
Published on: 19 Jan 2024 10:53 AM IST
Mp Vallabhaneni Balasouri Will Meet Today Pawan Kalyan In Hyderabad
X

MP Vallabhaneni Balasouri: జనసేనలోకి వైసీపీ ఎంపీ.. నేడు పవన్‌ కల్యాణ్‌తో భేటీ

MP Vallabhaneni Balasouri: ఏపీలో అధికార వైసీపీలో మార్పులు, చేర్పుల అంశం కొందరు నేతల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. సిట్టింగులకు సీటు దక్కకపోవడంతో.. కొందరు పక్క పార్టీల వైపు లుక్కేస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వంతు వచ్చింది. ఈసారి ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌కల్యాణ్ నివాసంలో ఉదయం 11 గంటలకు ఎంపీ బాలశౌరి సమావేశంకానున్నారు. ఈ సందర్భంగా జనసేనానితో చర్చలు జరపనున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై పవన్‌తో చర్చించనున్నారు. పవన్‌తో సమావేశం అనంతరం దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, ఈ మధ్యే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు పంపించారు. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత దక్కకపోవడంతోనే ఆయన పార్టీ వీడినట్లు తెలిపారు. మొత్తానికి ఎంపీ బాలశౌరి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story