logo
ఆంధ్రప్రదేశ్

Vizag Steel Plant: శ్రీనివాస్ వెంటనే తన ఇంటికి వెళ్లాలి- ఎంపీ రామ్మోహన్

MP Ram Mohan Naidu Responds on Steel Plant Employee Missing
X

Vizag Steel Plant: శ్రీనివాస్ వెంటనే తన ఇంటికి వెళ్లాలి: ఎంపీ రామ్మోహన్

Highlights

Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు.

Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు. ప్లాంట్‌ను కాపాడుకోవాలి అనే భావన ప్రతి ఆంధ్రుడిలోనూ ఉందన్న ఎంపీ అందరూ కలిసికట్టుగా పోరాడదాం అని పిలుపునిచ్చారు. శ్రీనివాస్ ఎక్కడ ఉన్నా తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలని ఎంపీ రామ్మోహన్ కోరారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో తన వంతుగా పోరాడుతానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని శ్రీనివాసరావు వంటి వారి మద్దతుతో తాము మరింత బలంగా పోరాడతామన్నారు. దయచేసి శ్రీనివాసరావు ఎక్కడున్నా తిరిగి ఇంటికి రావాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు.

Web TitleMP Ram Mohan Naidu Responds on Steel Plant Employee Missing
Next Story