MP Raghu Rama: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఎంపీ రఘురామకృష్ణరాజు
MP Raghu Rama: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికి ఆయన విడుదల సాధ్యం కాలేదు.
రఘురామ కృష్ణరాజు(ఫైల్ ఇమేజ్ )
MP Raghu Rama: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికి ఆయన విడుదల సాధ్యం కాలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామ కృష్ణరాజు ఉన్నారు. రఘురామ కృష్ణరాజును ఆయన కుమారుడు, వ్యక్తిగత న్యాయవాది కలిశారు. రేపు ఉదయం లోయర్ కోర్టులో బెయిల్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రిలీజ్ ఆర్డర్ వచ్చే వరకు ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామ ఉండనున్నారు. ప్రస్తుతం రఘురామ ఆరోగ్యం మెరుగు పడినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సోమవారం సాయంత్రంలోగా రఘురామ విడుదలయ్యే అవకాశం ఉంది. వారం రోజులుగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే.
Next Story




