Andhra Pradesh: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 7 April 2021 4:10 PM IST
Andhra Pradesh: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో మెజారిటీ నాలుగు లక్షలు తగ్గితే తోలు తీస్తానని సీఎం హెచ్చరించినట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు. తిరుపతి ప్రచారానికి సీఎం జగన్ వెళ్లకపోవడమే మంచిదన్న రఘురామ మెజారిటీ తగ్గితే మంత్రులపై నెపం నెట్టేయచ్చని ఎద్దేవా చేశారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎస్ఈసీ నీలం సాహ్నిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నిమ్మగడ్డ నిర్ణయాలను వ్యతిరేకించిన నీలం ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు వంతపాడుతున్నారని మండిపడ్డారు. ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఎన్నికల షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story